Header Banner

రిలయన్స్‌ ప్లాంట్‌కు డైరెక్ట్‌ సరఫరా.. వినూత్నంగా వెలుగులోకి కదిలే బంక్! మూడు వేల లీటర్ల సామర్థ్యం..!

  Thu Apr 10, 2025 17:05        Business

ఇప్పటి వరకూ మనం మొబైల్‌ టిఫిన్‌ సెంటర్లు.. మొబైల్‌ కూరగాయల మార్కెట్లు చూశాం. ఇప్పుడు కదిలే పెట్రోల్‌ బంక్‌ వచ్చేసింది. దీనిని చూసిన నెటిజన్లు.. ఈ ఐడియా ఏదో బావుందే.. ఇవే కనుక అందుబాటులోకి వస్తే.. ఇకపై పెట్రోల్‌ బంకుల దగ్గర క్యూ కట్టాల్సిన అవసరం ఉండదంటున్నారు. పెట్రోల్‌ బంక్‌ అంటే మంచి సెంటర్‌ చూసి అక్కడ ఏదొక ప్రాంతంలో బంక్‌ ఏర్పాటు చేస్తారు. వినియోగదారులంతా అక్కడికి వెళ్లి పెట్రోలు కొట్టించుకుంటారు. ఇకపై ఇలా పెట్రోలు బంకుల వద్దకు మనం వెళ్లక్కర్లేదనిపిస్తోంది. పెట్రోలు బంకే మనల్ని వెతుక్కుంటూ వచ్చే రోజులు రాబోతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. అవును, ఇదిగో కదిలే పెట్రోల్‌ బంక్‌ వచ్చేసింది.

ప్రకాశం జిల్లా కనిగిరి పరిధిలోని నరవాడకు చెందిన ఓ వ్యక్తి.. ఓ మినీ ట్యాంకర్‌ను కొనుగోలు చేసి, అందులోనే పెట్రోల్‌ పంపింగ్, రీడింగ్‌ యంత్రాలు అమర్చుకున్నారు. పరిశ్రమలు, వివిధ సంస్థల వద్దకు వాహనంతో వెళ్లి అవసరమైన పెట్రోల్, డీజిల్‌ సరఫరా చేస్తున్నారు. ఈ మినీ వ్యాన్‌ ట్యాంకర్‌ సామర్థ్యం 3,000 లీటర్లు. రిలయన్స్‌ సంస్థ కురిచేడు మండలం గంగదొనకొండ గ్రామ పరిధిలో బయో గ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. ఇందుకుగాను పెద్ద సంఖ్యలో ఇక్కడ పొక్లెయిన్లు, జేసీబీలు, లారీలు, ట్రాక్టర్లతో పనులు చేస్తున్నారు. ఆయా వాహనాలకు అవసరమైన ఇంధనాన్ని కదిలే బంకు ద్వారా సరఫరా చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #MobileFuelStation #RelianceEnergy #FuelInnovation #PetrolDelivery #OnTheGoFuel